వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలపై 99.71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద చికిత్స పొందిన 15,43,831 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. 15,39,506 మంది అంటే 99.71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఆరోగ్యశ్రీపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే 104 నెంబర్కు ఫోన్ చేయవచ్చని ఆరోగ్యశ్రీ పథకం సీఈవో ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ తెలిపారు.