కర్నూలులో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మిలాద్-ఉన్-నబీ'వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ జి. సృజన గురువారం పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, పేదలకు తమ వంతు సాయం అందించాలని ఆమె కోరారు. ఎస్పీ కృష్ణకాంత్, ఎంపీ సంజీవ్ కుమార్,ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,మేయర్ రామయ్య,డీసీసీబీ చైర్మన్ విజయ మనోహరి,మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.