ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది. రూ.37.3 లక్షలు చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు నోటీసులు అందజేశారు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూ.26.5 లక్షలు చెల్లించాలని, మరో రూ.2.65 లక్షలు జరిమానాగా, రూ.8.58 లక్షలు వడ్డీగా కట్టాలని వాణిజ్య పన్నుల శాఖ పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులతో ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ విలువ బీఎస్ఈలో 1.91 శాతం పడిపోయింది.