టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణంలో టిడిపి నాయకులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు17వ రోజు చేరుకున్నాయి. శుక్రవారం రిలే నిరాహార దీక్షలో ఖాజీపేట మండలం తెదేపా నాయకులు, కార్యకర్తలు, తెదేపా సీనియర్ నేతలు పాల్గొన్నారు.