కేరళలో ఇటీవల నిపా వైరస్ కలవరం సృష్టించిన విషయం తెలిసిందే. నిపా వైరస్ సోకి కోజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన నలుగురు బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. రెండు సార్లు వాళ్లకు వైరస్ పరీక్ష చేశామని, రెండు సార్లు కూడా నెగటివ్‌గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.