రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కే. నారాయణ స్వామి గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి చేరుకున్న మంత్రి నారాయణ స్వామి మిందిలోని అమర్నాథ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్డ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్,త దితరులు ఉన్నారు.