విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చలో విజయవాడ కార్యక్రమాన్ని వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి నియోజకవర్గాల్లో ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తు నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి తెలిపారు.