ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం చాపలమడుగు గ్రామంలో జగనన్న స్వచ్చత కార్యక్రమంపై ప్రజలకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం డిఎల్డిఓ, మండల ప్రత్యేకాధికారి బివిఎన్ సాయి కుమార్ పాల్గొని అవగాహన కల్పించారు. రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎంపిడిఓ మరియ దాసు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఉన్నారు.