సినీనటుడు, దర్శకుడు ఐనటువంటి రవిబాబు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో చేసారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇందులో అయన మాట్లాడుతూ.... జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినిమా వాళ్ల గ్లామర్ గానీ.. రాజకీయ నాయకుల పవర్ గానీ శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబుకు వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబం.. తమ కుటుంబానికి అత్యంత ఆప్తులు. చంద్రబాబు ఏదైనా పని అనుకుంటే అన్ని కోణాల్లో ఆలోచించి, అందరినీ సంప్రదించి.. ఎవరికీ ఇబ్బందులు కలిగించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజే చివరి రోజని తెలిసినా.. వచ్చే 50 సంవత్సరాలకు సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం. కానీ 73ఏళ్ల వయస్సున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం చాలా దారుణం. ఏ పవర్‌ను ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టారో.. అదే పవర్‌ను ఉపయోగించి విడుదల చేయాలి. ఆయనను బయటకు తీసుకొచ్చి విచారణ చేయాలని.. విచారణకు చంద్రబాబు కచ్చితంగా సహకరిస్తారని.. దేశాన్ని వదిలి పారిపోరు. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తించుకోవాలని అనుకుంటున్నారు. కక్షతో రగిలే కసాయి వాళ్లనా.. లేక జాలి మనసు, విలువలు ఉన్న మంచి నాయకులుగా గుర్తించాలా. దయచేసి చంద్రబాబును వదిలిపెట్టండి అంటూ రవిబాబు వీడియోలో పేర్కొన్నారు.