తిరుమలలో శుక్రవారం రాత్రి 12అడుగుల కొండచిలువ పట్టుబడిం ది. స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌లోని 816వ నెంబరు ఇంటి వద్దకు వచ్చిన ఈ పామును స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర నాయుడికి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa