అహ్మదాబాద్ - తిరుచ్చిరాపల్లి - అహ్మదాబాద్ (09419/09420) మధ్య నడిచే ప్రత్యేక రైలు గడువు డిసెంబరు 3వ తేదీ వరకు పొడిగించారు. అహ్మదాబాద్-తిరుచ్చిరాపల్లి మధ్య నడుస్తున్న ఈ రైలు ప్రతి గురువారం ఉదయం 9.30గంటలకు అహ్మదాబాద్‌లో బయల్దేరి షోలాపూర్, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్లు, తాడిపత్రిమీదుగా శుక్రవారం ఉదయం 10గంటలకు కడప రైల్వేస్టేషన్ చేరుకోనుంది. అక్కడ నుండి రేణిగుంట, అరక్కోణం, పెరుంబుర్, చెన్నై మీదుగా శనివారం రాత్రి 3.45కు తిరుచ్చిరాపల్లికి చేరుకోనుంది. ఈ రైలు అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో అహ్మదాబాద్ నుంచి తిరుచ్చిరాపల్లికి నడవనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుచ్చిరాపల్లె నుంచి అహ్మదాబాద్‌కు ప్రతి ఆదివారం ఉదయం 5.40కి బయల్దేరి అదే రోజు రాత్రి 8.20కి కడప రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. అహ్మదాబాద్‌కు సోమవారం సాయంత్రం 9.15కు చేరుకోనుంది. ఈ రైలు అక్టోబరు 1, 8, 15, 22, 29, నవంబరు 5, 12, 19, 26, డిసెంబరు 3 తేదీల్లో ప్రయాణించనుంది.