విశాఖపట్నం పరిధిలోని వాల్తేరు డివిజన్ రైల్వే స్టేషన్ ముందున్న బస్టాప్ పక్కనే కొత్తగా ‘వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో రెస్టారెంట్లను రైల్వే అధికారులు నిర్మించారు. ఇందులో ఒకటి ‘కోచ్ రెస్టారెంట్.’ అంటే పాత రైలు కోచ్‌ను తీసుకువచ్చి, రెస్టారెంట్‌గా మార్చారు. చాలా అందంగా తయారుచేశారు. ఇటీవల నగర ప్రజలు మండీ రెస్టారెంట్లపై ఆసక్తి చూపుతున్నారని అది కూడా ఒకటి ఏర్పాటుచేశారు. ఇవన్నీ 24/7 పనిచేస్తాయి. ఏ సమయంలో వెళ్లినా వేడివేడి ఆహార పదార్థాలు లభిస్తాయి. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇందుకు ఏడాదికి రూ.72 లక్షలు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. వీటిని రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన విక్రమ్ జర్దోష్ చేతులు మీదుగా శనివారం ప్రారంభించనున్నారు. ఇలాంటి కోచ్ రెస్టారెంట్లు గతంలో చాలాచోట్ల ఏర్పాటుచేశారు. గత ఏడాది విజయనగరంలో పెట్టగా మంచి ఆదరణ లభించింది.