రూ.2000 నోటు ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. ఈ నోటును రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించింది. ఆ తర్వాత సదరు నోటు చెల్లనిదిగా మిగిలిపోతుంది. అయితే, ఇప్పటికే ఆ నోటును ప్రజలు బ్యాంకులలో జమచేశారు. ఇతరత్రా లావాదేవీల ద్వారా మార్పిడి చేసుకొన్నారు. అయినా ఈ నోట్ల మార్పిడి విషయంలో కొందరు ఏమరుపాటుగా ఉన్నారని, అలాంటి వారు శనివారం లోగా మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.