విజయనగరం జిల్లా, గజపతినగరానికి చెందిన బీవీఎన్ రాజేశ్వరరావు 2015లో లైసెన్స్ లేకుండా మందులు నిల్వ ఉంచి అమ్మకాలు సాగిస్తున్న కేసులో మూడేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా కోర్టు విధించింది. ఇందుకు సంబంధించి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2015లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో భాగంగా కేసు నమోదు చేశారు. దాడులు నిర్వహించిన డ్రగ్‌ఇన్ స్పెక్టర్ యుగంధర్, ఎన్ కల్యాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఇంతవరకూ విచారణ చేపట్టిన కోర్టు నిందితునికి శిక్ష విధించింది. ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా మందులు అమ్మకాలు చేయటం చట్ట విరుద్ధమని, చర్యలు తీసుకుంటామని జిల్లా సహాయ సంచాలకులు రజిత ప్రకటనలో తెలిపారు.