విజయనగరం జిల్లా, శృంగవరపుకోటలో చంద్రబాబు అరెస్టుకి నిరసనగా టీడీపీ నేతలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాలను ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చేయని నేరానికి చంద్రబాబు ను జైల్లో ఉంచడంతో ప్రజల్లో రోజు రోజుకూ సానుభూతి పెరుగు తుందన్నారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గుర్తిస్తున్నారన్నారు. చెత్తద్వారా విద్యుత్‌ను సృష్టించి చంద్రబాబు సంపదను పెంచితే.. ఇదే చెత్తపైన పన్ను విధించి ప్రజలపై ఆర్థిక భారం మోపిన ముఖ్యమంత్రిగా జగన్ పేరు సంపాదించారని ఎద్దేవా చేశారు. కియో కార్ల వంటి కంపెనీలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదైతే, ఉన్న కంపెనీలను పారిపోయేటట్లు చేసిన ఘనుడు జగన్ అన్నారు.