చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పుబట్టింది సీపీఐ . పలు జిల్లాల్లో టీడీపీకి బాసటగా సీపీఐ నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వంను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సందర్భంలో తెలుగుదేశం ఇచ్చిన బంద్ పిలుపునకు జనసేన సీపీఐ కూడా తెలుగుదేశం నాయకుల వెంట నడిచారు. ఈ పొత్తు అంశంపై మూడు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో ప్రభజనం సృష్టించవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఐతే బీజేపీని వీడి వస్తేనే అది సాధ్యమని కొందరు సిపిఐ నేతలు అభిప్రాయపడుతున్నారు.