ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోటలో ఈటీసీ లేఅవుట్లో పేదలకు నిర్మించిన గృహాలను సామూహికంగా ప్రారంభించేందుకు, పైలాన్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అక్టోబరు 5న రానున్నారు. ఈ మేరకు అధికారికంగా సీఎం పర్యటన ఖరారు అయినట్టు సామర్లకోట మున్సిపల్, మండల అధికారులకు సమాచారం అందింది. గత 50 రోజులుగా సీఎం పర్యటనకు సామర్లకోటలోనే జిల్లా అధికార యంత్రాంగం ఉండి షేర్వాల్ టెక్నాలజీతో గృహాలను నిర్మించే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సామూహిక గృహప్రవేశాలతోపాటు సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని అం దుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు.