నెల్లూరు జిల్లాలో కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా రొయ్యల చెరువులు ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులకు,కోర్టుధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జి.మంగమ్మ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి.మారుతి ప్రసాద్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. సొమ్ము చెల్లించడంలో విఫలమైతే 15రోజుల పాటు సివిల్ ప్రిజన్‌లో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అలాగే, పిటిషనర్‌కు ఖర్చుల కింద తమ సొంత డబ్బులను రూ.2లక్షలు (చెరో రూ.లక్ష) చెల్లించాలని ఇరువురినీ ఆదేశించింది. ఈ సొమ్మును అక్టోబరు 3లోగా చెల్లించడంలో విఫలమైతే సివిల్ ప్రిజన్‌లో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు శుక్రవారం తీర్పుఇచ్చారు.