బీహార్లోని పాట్నా శివార్లలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తర్వాత తన స్నేహితులు ఐదుగురిని రప్పించాడు. వారంతా కలిసి పొలంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వదిలేసి పారిపోయారు. శుక్రవారం ఉదయం బాలిక తన కుటుంబ సభ్యులకు కనిపించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.