కిడ్నాప్ తర్వాత హత్యకు గురైన యువతి, యువకుడి కుటుంబ సభ్యులను మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే శుక్రవారం పరామర్శించారు. జులైలో వారు అదృశ్యమయ్యారు. ఇటీవల ఇంటర్‌నెట్‌పై బ్యాన్ ఎత్తివేయడంతో వారిద్దరూ హత్యకు గురైన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో రాజధాని ఇంఫాల్‌లో హింస చెలరేగింది. ఈ క్రమంలో బాధితుల కుటంబాలను గవర్నర్ కలిసి వారిని ఓదార్చారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.