వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకూడదంటూశనివారం విశాఖపట్నంలో సిపిఎం ఆధ్వర్యంలో బైక్ యాత్ర చేపట్టింది.అనంతరం ఉమెన్స్ కాలేజీలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.లోకనాథం,సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, సిఐటియు నాయకులు ఆర్కే శ్రీకుమార్,జగదాంబ జోన్ కార్యదర్శి ఎం. సుబ్బారావు, వై.రాజు,ఐద్వా నాయకులు ప్రియాంక,వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.