విశాఖపట్నంలో వైఎంసీఏ బీచ్ తీరానికి శుక్రవారం రాత్రి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెట్టెలో ఏముందోనని అందరూ ఉత్కంఠగా చూశారు. ఈ క్రమంలో అధికారులు బాంబ్ స్క్వాడ్ పర్యవేక్షణలో రెండు JCBలతో దాన్ని పగలగొట్టారు. లోపల ఎలాంటి వస్తువులు లేవని అధికారులతో ఉత్కంఠకు తెరపడింది. అది అత్యవసర సమయాల్లో షిప్పుల్లో లంగర్గా వాడే పెట్టె అని వెల్లడించారు.