ఇన్వ్ స్ట్ మెంట్ స్కీమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.854 కోట్ల కుంభకోణానికి పాల్పడగా బెంగుళూర్ పోలీసులు దీనిని గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఆరుగురిని ఆదుపులోకి తీసుకొని రూ. 5 కోట్లను ఫ్రీజ్ చేశారు. చిన్న మెుత్తంలో పొదుపు చేస్తే ప్రతి రోజు రూ.5 వేల వరకు లాభం పొందవచ్చని వేలాది మందికి ఆశ చూపి వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా బాధితుల్ని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.