ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన TDP నేత బండారు సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ లేఖలో కోరారు.