గాంధీజీ అహింసా, త్యాగాల వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీపట్నంలో ఆయన మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘బందర్ జాతీయ ఉద్యమానికి పునీతమైన నేల. ఆంధ్రా నేషనల్ కాలేజ్ ప్రత్యేకమైన పరిస్థితిలో పెట్టారు. మనది అని చెప్పేందుకు పెట్టిన కాలేజీ ఇది. దివిసీమ, బందరు ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు. నేషనల్ కాలేజ్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలోనే మువ్వెన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నోరి దత్తాత్రేయ వంటి ఎందరో ఈ ఆంధ్రా కళాశాలలో చదివారు. నేడు ఈ కళాశాలలో సరైన వసతులు లేవని చెబుతున్నారు. గాంధీ వెళ్లిన ఆ కళాశాలను త్వరలో సందర్శిస్తా. ఈశ్వర్ అల్లాతేరా నామ్ అనేది గాంధీ గారు పెట్టించారు. భక్తి పాటలను ఎవరూ మార్చలేరు. కానీ సనాతన ధర్మం అందరినీ కలిపి తీసుకెళుతుంది. మన దేశ ఔన్నత్యాన్ని పెంచిన గాంధీకి రుణపడి ఉండాలి.’’ అని కోరారు.