తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా లోకేష్ చేపట్టిన సత్యగ్రహా నిరాహార దీక్షకు ఎంపీ రఘురామ కృష్ణరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ...‘‘జగన్ జైలు జీవితం వేరు, దేశ స్వాతంత్రం కోసం గాంధీ జైలు జీవితం వేరు. మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ గాంధేయ మార్గంలో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దమన నీతికి అతీతంగా నేను నిరసన తెలుపుతున్నాను. లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపాను అని తెలియజేసారు.