వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా జైలుకు వెళ్తారని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘2024 ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి 160 సీట్లు సాధిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసి సీఎం జగన్రెడ్డి తన గోతిని తానే తవ్వుకున్నాడు. జగన్మోహన్రెడ్డిని త్వరలో ఏపీ నుంచి తరిమేసే రోజులు వస్తాయి. జగన్రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అవినీతిలో కూరుకుపోయారు అని డీఎల్ రవీంధ్రారెడ్డి పేర్కొన్నారు.