జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదు.. సైకిల్సైనికులు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సైకిల్‌కు తప్పు పట్టింది.. టైర్లు లేవు.. చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోంది. జనసేన అవినీతి జెండా కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే ఎదుగుతోందన్నారు. కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర తయారైందని, చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి-4 యాత్ర ఫ్లాప్ అయ్యిందన్నారు.