"అవినీతి చక్రవర్తి"కి అబద్ధాల భార్య భువనేశ్వరి అంటూ వైయస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అభివర్ణించారు. భువనేశ్వరి చేపట్టిన దీక్ష ప్రజల దృష్టిలో అదొక అసత్యాగ్రహానికి దీక్ష అని విమర్శించారు. అవినీతిపరుడు జైలుకెళ్తే ఆయనకు వత్తాసుగా నారా భువనేశ్వరి దొంగదీక్షలు చేయడమేంటి..? జైలుపాలైన దొంగ కోసం దొంగదీక్షలు చేయడమనేది ఒక్క మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. మొన్ననేమో కంచాలు కొట్టమని పిలుపునిచ్చారు. లంచాలు తిన్నోడి కోసం కంచాలు కొట్టడమేంటని ప్రజలంతా ఛీ కొట్టారు. నిన్నటి భువనేశ్వరి దీక్షకూ ప్రజాస్పందన లేదన్నారు. అవినీతిమార్గంలోనే చంద్రబాబు అండ్ కో నడిచారని ప్రజలే చెబుతున్నారు. వీళ్లను గాడ్సే వారసులుగా ప్రకటించినా తప్పేమీలేదనే అభిప్రాయంలో ప్రజలున్నారని వ్యాఖ్యానించారు.