కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్ను చేనేత కార్మికులు కలిసి తమ సమస్యలు తెలియజేసారు. పెడన చేనేత కార్మికుడు మాట్లాడుతూ.. ‘‘మా జీవనం చాలా కష్టంగా మారింది. అప్పుల బాధతో నా కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. మగ్గం వర్కులకు ఆదరణ లేక అవస్థలు పడుతున్నాం. నేను, నాభార్య అనారోగ్య కారణాలతో ఇభ్బందులు పడుతున్నాం. చేనేత కార్మికులు ఉపాధి కోసం దినసరి కూలీలుగా మారుతున్నారు. జగన్ యేడాదికి 24వేలు ఇచ్చి, 75 వేల రూపాయలు నిలిపివేశారు. చేనేత కార్మికులను ఆదుకుని, భరోసా కల్పించాలని’’ కోరారు.