టీడీపీ అధినేత నారా చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపడం పట్ల ఉరవకొండ మండలంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద 21వ రోజు టీడీపీ పాల ఏకీల నాయకులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంతకుముందు దీక్ష శిబిరం నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.