ఈ నెల 11వ తేది నుంచి ఎందుకు ఆంధ్రకి జగనే కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం గోరంట్ల పట్టణంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో మండల సచివాలయం కన్వీనర్లుకు, జెసిఎస్ ఇంచార్జ్, ముఖ్య నాయకులకు, సర్పంచులకు, శిక్షణ శిబిరం ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల కన్వీనర్, తదితరులు పాల్గొన్నారు.