జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న చేనేత కార్మికులు తమ సమస్యలని తెలియజేసారు. చేనేత కార్మికుల సమస్యలపై పవన్ స్పందిస్తూ.. జనసేనకు కులాల మీద చాలా సమగ్రమైన అవగాహన ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చీరాలలో పెరిగినప్పుడు అక్కడ పేరాలలో చేనేత మగ్గాలు ఎక్కువ అని... వర్షం వచ్చినప్పుడు మగ్గంలోకి నీరు వెళ్లి ఇబ్బందులు పడేవారని తెలిపారు. చేనేత కార్మికులు నేడు దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. మగ్గం నేసినా కూడా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలకు అయితే చెప్పుకోలేని సమస్యలను వస్తాయన్నారు. చేనేతను బతికించుకోవాలనే తపన దేశంలో అందరికీ ఉండాలని చెప్పుకొచ్చారు. తాను కూడా చేనేత ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ప్రకటించానని తెలిపారు. కళానైపుణ్యం, కష్టంతో వారు కళాఖంఢాలు సృష్టిస్తారన్నారు. లోక్‌నాథం వంటి వారిని చూసి తన గుండె బరువెక్కుతోందన్నారు. చేనేత కార్మికులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.