కృష్ణా జిల్లా జనవాణి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడనలో వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని.. అమలాపురం మాదిరిగా అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు. 'దాడులు చేయడానికి 3 వేల మంది వరకు వస్తారు. జనసైనికులు వారిపై ఎదురుదాడికి దిగొద్దు. దాడి చేసేందుకు కత్తులు, రాళ్లు తీస్తే, వారి కాళ్లు, చేతులు కట్టేయండి. దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి' అని అన్నారు.