ఇరాక్‌లో సెప్టెంబర్ 26వ తేదీన ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం కారణంగా 100 మంది మృతి చెందగా.. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోసుల్ నగర శివార్లలోని ఓ ఫంక్షన్ హాల్ ఈ ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివాహ వేడుకల్లో భాగంగా ఫంక్షన్ హాల్‌లోనే పటాసులు కాల్చగా.. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa