గరుగుబిల్లి మండలం గొట్టివలస లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మంగళవారం సందర్శించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల వద్ద రిసెప్షన్, మందులు, పరీక్షలు, వైద్యుల సలహాలు, వివరాల నమోదు కౌంటర్లను పరీశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పేదలకు వరం అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పారు.