ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మంగళవారం చీకటి పేట గ్రామ సచివాలయంలో జరిగిన కార్యక్రమములో స్పందన కరువు అని చెప్పక తప్పదు. ఆ గ్రామ సచివాలయంలో కాగాం, చీకటి పేట, అరస బలగ, మోదుగ వలస గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి2529 మందికి సర్వే చేశారు. అందులో బిపి, 1834, షుగర్1373, అలాగే ఐబీపీ892, ఉన్నట్లు వైద్య సిబ్బంది కాగిత లెక్కలు చూపించారు.