రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంమని అందుకే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. లత్తవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.