విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి దుర్గా శరన్నవరాత్రుల రాష్ట్ర పండుగ సాధనా కమిటీ ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మోకాళ్లతో మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విశ్వ హిందూ ఆర్గనైజేర్ శివ ప్రసాద్ కన్వీనర్ మాట్లాడుతూ.. అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర పండగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఇంద్రకీలాద్రి అమ్మవారికి దసరా ఉత్సవాలకు విధులకు హాజరయ్యే వారి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు.