రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని లేపాక్షి మండల టిడిపి నాయకులు అన్నారు. ఈ సందర్భంగా లేపాక్షి మండల కేంద్రంలో బుధవారం టిడిపి నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం మేలుతోందని అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని లేపాక్షి ఏఎస్ఐకు అందజేశారు.