ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు పోలీస్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వాదనలు విననున్నారు. వీటిపై ఈ రోజు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో పిటి వారెంట్ పైనా విచారణ చేసే అవకాశం ఉంది. అయితే న్యాయవాదుల నివాసాల్లో ఎన్ఐఏ తనిఖీలను నిరసిస్తూ బీబీఏ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపుతో సంబంధం లేకుండా తమ వాదనలు వినాల్సిందిగా జడ్జిని కోరతామని టీడీపీ, సీఐడీ తరపు న్యాయవాదులు చెబుతున్నారు.