ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడపనకల్ మండలంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 01:01 PM

విడపనకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో బుధవారం అధికారులు ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గర్గ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com