ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపక్షాలను జైల్లో పెట్టి మళ్లీ ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 01:01 PM

రాష్ట్ర ప్రభుత్వంపై  టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు  ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందన్నారు. తాను 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి మిగతా వారిని జైలుకు పంపాలని భావిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టి మళ్లీ ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారన్నారు.  నైపుణ్యాభివృద్ది శిక్షణకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తే 3 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమో సీఐడీ సంజయ్‌కు తెలియాలని అన్నారు. లేని రింగు రోడ్డులో అక్రమాలు జరిగాయనిమరో కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాల్లో ఏటా 12 వందల కోట్లు జగన్‌కు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆఫీస్‌లకు వైసీపీ రంగులు వేసి 3 వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. జగన్ నేర స్వభావంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు తప్పవన్నారు. గతంలో శ్రీ లక్ష్మీ , ఎల్వీ సుబ్రహ్మణ్యం, గౌతం సవాంగ్ ఉదంతాలు గుర్తు చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు తప్పు చేశారని సజ్జల సిగ్గు లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, మద్యం అమ్మకాలు, కోడి కత్తి కేసు, బాబాయ్ హత్య గురించి మాట్లాడే ధైర్యం సజ్జలకు ఉందా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com