స్వమిత్వ సర్వే పై ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుండి కలెక్టర్ బుధవారం సంక్షేమ, అభివృద్ధి అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్ 24 లోగా తప్పనిసరిగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.