ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు చేయడం తీవ్రంగా ఖండించదగిన అంశమని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ఓ నియంతలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ‘‘ఇండియా కూటమి నేతలపై బీజేపీ.. బలవంతం, అణచివేత, భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఈ నియంతృత్వ పద్దతిని అవలంబిస్తోంది’’అని వ్యాఖ్యానించారు.