స్థానిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం లింగసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ. జిల్లా కేంద్రానికి రాలేని వారి కొరకు మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa