వచ్చే ఎన్నిల్లో టీడీపీ విజయాన్నిఆపడం ఎవరితరం కాదని కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికీ 22వ రోజుకు చేరుకొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... చంద్రబాబు చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ, నారా లోకేశ్ కొనసాగిస్తున్న యువగళం ప్రజల నుంచి టీడీపీకి ఆదరణ పెరిగిందన్నారు. దీంతో టీడీపీపై కక్ష చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం వైసీపీ నీచ సంస్కృతికి తెరలేపిందన్నారు. స్కిల్ డెవల ప్మెంటు ఎలాంటి అవినీతి జరగలేదన్నది అందరికి తెలుసని, కానీ లేని అవినీతి జరిగిందని వైసీపీ చూపించడం దారుణమన్నారు.