ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలని కోరిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 02:07 PM

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్లీపర్‌, జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఢిల్లీలో రైల్వేబోర్డు చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హాకు వినతిపత్రం అందజేశారు. ‘శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వేలాదిమంది ప్రయాణికులు రాక పోకలు సాగిస్తుంటారు. భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పది స్లీపర్‌కోచ్‌లు ఉండేవి. వాటిని కుదించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్‌, జనరల్‌ బోగీలు పెంచాలి. వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైలును భువనేశ్వర్‌-విశాఖ మధ్య నడపాలి. శ్రీకాకుళంలో హాల్ట్‌ కల్పించాలి. దీనివల్ల ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడతాయి. భువనేశ్వర్‌, పలాస మధ్య రాకపోకలు సాగిస్తున్న మెమూ రైళ్లను శ్రీకాకుళం వరకు పొడిగించాలి. విశాఖ- పలాస మెమూ రైళ్లను ఇచ్ఛాపురం వరకు నడపాలి. హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇచ్ఛాపురంలో నిలపాలి. రౌర్కెలా-గుణుపూర్‌ రాజా-రాణి ఎక్స్‌ప్రెస్‌కు టెక్కలి, పాతపట్నంలో, భువనేశ్వర్‌-రామేశ్వరం రైలుకు శ్రీకాకుళం రోడ్డు, పలాసలో హాల్ట్‌లు కల్పించాలి. హౌరా-మైసూర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలుకు శ్రీకాకుళం రోడ్డు నందు, భువనేశ్వర్‌- విశాఖ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హరిశ్చంద్రపురంలో హాల్ట్‌ కల్పించాల’ని ఎంపీ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com