టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతడి భార్య రుజిర బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 9న అభిషేక్, అక్టోబర్ 11న రుజిర బెనర్జీ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా, పశ్చిమ బెంగాల్లో ప్రైమరీ టీచర్ల పోస్టులను అక్రమంగా భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.