పండగపూట ప్రయాణాలు చేసేవారికి APSRTC శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలో 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక సర్వీసులను సాధారణ ఛార్జీలతోనే నడపనున్నట్లు పేర్కొంది. ఇక అడ్వాన్స్ రిజర్వేషన్‌తో ఛార్జిలో 10 శాతం రాయితీ అందించనున్నట్లు వివరించింది.